సింగరేణి సీఎంఓఏ సుజాత
ఏరియా పరిరక్షణ కమిటీతో సీఎంఓఏ పోయే చర్చలు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మిక నేతలు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 03 : సెప్టెంబర్ చివరి నాటికి బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి సమస్యలన్ని పరిష్కరిస్తానని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుజాత హామీ ఇచ్చారు.ఈ మేరకు శనివారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ సమక్షంలో సీఎంఓఏ సుజాతతో బెల్లంపెల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నేతలు చర్చలు జరిపారు.గత రెండు రోజుల క్రితం స్థానిక శాసనసభ్యుడిని ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నేతలు కలిసి సమస్యను విన్నవించడంతో అనంతరం సింగరేణి చైర్మన్ తో మాట్లాడి సమస్యను వివరించడం జరిగింది. దీంతో సింగరేణి చైర్మన్ ఆదేశాలతో సింగరేణి ఏరియా ఆసుపత్రి సందర్శనకు కొత్తగూడెం నుండి సింగరేణి సిఎంఓఏ సుజాత వచ్చారు. ఆస్పత్రి సందర్శన విషయం ముందే తెలియడంతో పెద్ద ఎత్తున సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ ట్రేడ్ యూనియన్ నాయకులు తరలివచ్చారు. అనంతరం సింగరేణి ఆసుపత్రి సూపర్డెంట్ కార్యాలయంలో చర్చలు జరిగాయి.ఈ చర్చల్లో ప్రధానంగా ఆసుపత్రి ఓపిలు తక్కువ చూపిస్తూ ఆస్పత్రిని ఇక్కడ నుండి ఎత్తివేసే కుట్రలకు సింగరేణి యాజమాన్యం వ్యూహత్మకంగా ముందుకెళ్తోందని పరిరక్షణ కమిటీ నేతలు సీఎంఓఏకు తెల్చిచెప్పారు. ముఖ్యం గా ఆసుపత్రిలో స్పెషలిస్ట్ డాక్టర్లను,ఇతర సిబ్బందిని త్వరితగతిన నియమించాలని విన్నవించడంతో సాధ్యమైనంత త్వరలోనే నియమిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నేతలతో సి ఎం ఓ ఏ చర్చల సందర్భంగా ఇతర సింగరేణి అధికారులు కలుగజేసుకోవడంతో పరిరక్షణ కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో కలగజేసుకున్న సీఎంఓఏ అందరికీ సర్ది చెప్పారు.మొత్తం మీద చర్చలు ప్రశాంత వాతావరణంలో సక్సెస్ అయ్యాయని ఏరియా ఆస్పత్రి పరిరక్షణ కమిటీ నేతలు చెప్పారు. అనంతరం పరిరక్షణ కమిటీ నాయకులు సీఎంఓఏ ను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు ఏఐటీయూసీ నుండి చిప్ప నరసయ్య, దాగం మల్లేష్, రత్నం ఐలయ్య, ఐఎన్టీయూసీ నుండి సిద్ధంశెట్టి రాజమౌళి,గెల్లి జయరాం యాదవ్, కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు హెచ్ఎంఎస్ నుండి ఎండి ఓజియార్, టి ఎన్ టి యు సి నాయకులు, పరిరక్షణ కమిటీ కన్వీనర్ టీ మణి రామ్ సింగ్,ఇఫ్టు నుండి ఎండి చాంద్ పాషా,ఎస్ మల్లేష్, ఎస్ జి కె ఎస్ నుండి అంబాల మహేందర్, ఏన్నం శంకర్, ఏఐఎఫ్ టియు నుండి ఎం పోచమల్లు, టీయుసిఐ గోగర్ల శంకర్,సిఐటియు నుండివెంకటస్వామి, రమణ,టి ఎస్ యు ఎస్ నుండి టీ జైపాల్ సింగ్ లు చర్చల్లో పాల్గొన్నారు