పుష్పాలంకరణ వేడుక కార్యక్రమంలో పాల్గొన్న తుంబూరు దయాకర్ రెడ్డి, మేకల మల్లిబాబు యాదవ్

 

ఇల్లందు ప్రతినిధి నవంబర్ 02 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గo కామేపల్లి మండలం తాజా మాజీ ఎంపీపీ బానోతు సునీత – రాందాస్ ల కూతురు భవిత పుష్పాలంకరణ వేడుక లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చి. భవిత ను ఆశీర్వదించారు. బీసీల కుల గణన కార్యక్రమం, ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించబడుతుందని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరు అవుతున్నాయని, ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం భారీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని, ధరణి కార్యక్రమం వల్ల గ్రామాల్లోని రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో శీలం పుల్లయ్య మేకపోతుల మహేష్ రాయల ఉపేందర్ అంబడిపూడి సత్యం బానోత్ సీతారాములు, ఎంపీటీసీ బి సునీత ఇమామ్ సత్తి వీరబాబు గోపి చిలుముల రమేష్ గబ్రు నాయక్ రాజు,l అంబడిపూడి వెంకటయ్య నగేష్ వెంకట్ బిక్షం తెల్లబోయిన రాము వెంకటేష్ మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking