తూప్రాన్ లో చిల్డ్రన్ హాస్పిటల్ ను ప్రారంభించిన తుముకుంట నర్సారెడ్డి, ఉప్పల శ్రీనివాస్

 

తూప్రాన్, ఫిబ్రవరి, 10. ప్రాజబలం ప్రతినిధి :-

తూప్రాన్ లోని నర్సాపూర్ చౌరస్తాలో ఐవీఎఫ్ మెదక్ జిల్లా ప్రెసిడెంట్ ఉప్పల నర్సింహులు, డాక్టర్ ఉప్పల సాయి వెంకటేష్ లు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సాయి చిల్డ్రన్ హాస్పిటల్ ను గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి తుముకుంట నర్సారెడ్డితో కలిసి టి.పి.సి.సి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రేసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త లు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పిల్లలకి అన్ని విధాలా వైద్యం అందించాలని డాక్టర్లలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తుఫ్రాన్ కౌన్సిలర్, ఐ.వి.ఎఫ్ రాష్ట్ర కోశాధికారి నారాయణగుప్త, నరేష్ గుప్త, శ్రీధర్, ఐ.వి.ఎఫ్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking