హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి జనవరి 10
జమ్మికుంటలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి) లో 86వ బ్రహ్మోత్సవాలు మొదలు కావడం జరిగింది.ఇందులో భాగంగా సోమవారం రోజున స్వామివారి ద్వజారోహణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలయ పరిసరాలలో శివనామస్మరణ తో మారుమోగాయి. ఆలయ ట్రస్టీలైన కొండూరు సభ్యులు అమర్నాథ్ దంపతులచే ఆలయ అర్చకులు మండలేముల వేణుగోపాల్ శర్మ ఆధ్వర్యంలో ద్వజారోహణము మరియు అగ్ని ప్రతిష్ట ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కొండూరు కుటుంబం సభ్యులచే ప్రారంభం చేయించడం జరిగింది.