ప్రభంజనాన్ని సృష్టించిన తూప్రాన్‌ శ్రీ చైతన్య

క్యాట్‌ ఫలితాల్లో బంగారు పతకాలు, మెరిట్‌ సర్టిఫికేట్స్‌, నగదు పురస్కారాన్ని అందుకున్న శ్రీ చైతన్య విద్యార్థులు
తూప్రాన్‌, జనవరి, 21. ప్రజాబలం ప్రతినిధి. క్యాట్‌ ఫలితాల్లో తూప్రాన్‌ శ్రీ చైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 2022-23 సంవత్సరానికి గాను క్యాట్‌ ఫలితాల్లో అల్‌ ఇండియా ఒలంపియాడ్‌ నిర్వహించిన క్యాట్‌ పరీక్షల్లో తూప్రాన్‌ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. క్యాట్‌ పరీక్షల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 52 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో 6 గురు విద్యార్థులు ఒక్కో వేయ్యి రూపాయల నగదు బహుమతి పొందారు. 24 మంది విద్యార్థులు బంగారు పథకాలను సాధించారు. 22 మంది విద్యార్థులు మెరిట్‌ సర్టిఫికేషన్‌ సాధించారు. ఒలంపియాడ్‌ నిర్వహించిన క్యాట్‌ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, డీన్‌ నవీన్‌ కుమార్‌, ఇంచార్జీ అశోక్‌ గార్లు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎ.జీ.ఎం రమణారావు, జోనల్‌ డీన్‌ జైపాల్‌ రెడ్డి, జోనల్‌ ఆకాడమిక్‌ కో-ఆర్డినేటర్‌ సీతారాం రెడ్డి లు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking