నేడే మణికొండలో ఉచిత వైద్య శిబిరం

రాజేంద్రనగర్‌ ప్రజాబలం ప్రతినిధి:రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని మణికొండ మున్సిపాలీటీ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ మణికొండలో యశోద హస్పిటల్‌ హైటెక్‌సీటీ సహాకారంతో మరియు విఆర్‌4యూ సీనీయర్‌ సిటీజన్స్‌ గ్రూపు వారి సహాకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం 22 వతేదీన నిర్వహింబడును.ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ ,ఆర్ధోపెడిక్‌,న్యూరాలజీ ,ఫాల్మోనాలజీ ,జనరల్‌ మెడిసిన్‌ ,గైనాకాలజీ ,ఆఫ్తమాలజీ,డెంటల్‌ డాక్టర్లు పాల్గోంటారు.

 

ఈ కార్యక్రమంలో బీపీ,ఆర్‌బీఎస్‌,బీఎంఐ,బీఎండీ,ఈసీజీ,2డీ ఈకో ను డాక్టర్ల సూచనల మేరకు ఉచితంగా పరీక్షలు చేయబడును.మరియు డాక్టర్ల సూచనల మేరకు వైద్య పరీక్షల అనంతరం నోయల్‌ ఫార్మా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మందులను అందె లక్ష్మణ్‌రావ్‌ సహకారంతో ఉచితంగా ఇవ్వబడును.కావున మణికొండ మున్సిపాలీటీ లో నివాసం ఉంటున్న ప్రజలు మణికొండ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విచ్చేసి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందె లక్ష్మణ్‌రావ్‌ కోరినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 19వ వార్డు కౌన్సిలర్‌ కె.రామక్రిష్ణారెడ్డి విచ్చేయుచున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking