వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 21:
ప్రజలకు ప్రభుత్వాలకు ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా పత్రికలు నిలుస్తాయని, ప్రజా సమస్యల వెలికితీతలో ప్రజాబలం తెలుగు దినపత్రిక ముందు వరుసలో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ అన్నారు. వరంగల్ విలేకరుల ఆధ్వర్యంలో 2023 ప్రజాబలం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ను శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ డిసిపి వైభవ్ గైక్వాడ్ తో కలిసి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాస్తూ సమాజంలో నెలకొన్న సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని అధికారులను అప్రమత్తం చేసి పరిష్కారం దిశగా నడిపించేవే పత్రికలని అలాంటి పత్రికలలో ప్రజాబలం పత్రిక కూడా ఒకటని, ప్రజా సమస్యల పై మరింత లోతుగా అన్వేషించి, సమస్యలనూ వెలికితీసి సమాజిక అభివృద్ధికి దోహదపడుతూ ప్రజల్లో మరింత ఆదరణ అభిమానాలు చూరగొనాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ రాజేందర్, హరీష్, ఏసిపిఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గుండా ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Next Post