చికిత్స పొందుతున్న జర్నలిస్టుకు ఆర్థిక సహాయం

ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మంలో ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్ర గాయాలు పాలైన రఘునాథపాలెం మండల పత్రిక విలేకరి పాశం వెంకటేశ్వర్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచన మేరకు మంత్రి వ్యక్తిగత సహాయకుడు ( పి ఏ) చిరుమామిళ్ల రవికిరణ్ కొంత ఆర్థిక సహాయం చేశారు.

రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి జె ఎఫ్) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ , రవి లు మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడంతో చైతన్య నగర్ లో నివాసం ఉంటున్న జర్నలిస్ట్ పాశం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి బాధితున్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకొని ఆర్థిక సహాయం చేశారు. త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.

బాధితున్ని పరామర్శించిన వారిలో కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి జె ఎఫ్) ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు టీ.ఎస్ చక్రవర్తి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, నగర అధ్యక్ష కార్యదర్శులు బాల బత్తుల రాఘవ, కోటేశ్వరరావు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందుల జగదీష్ అశోక్ జిల్లా నగర నాయకులు తిరుపతి రావు ఉపేందర్ గోపి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking