ఏడుపాయాల….మాఘ అమావాస్య..

పుణ్య స్నానాలు!!
పటిష్టమైన పోలీసు బందోబస్తు!!
ఎడపాయల అమ్మవారి ప్రాంగణ మొత్తం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షయణ!

ఎస్.పి..పి.రోహిణి ప్రియదర్శిని

ఎస్.పి.శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు మాఘ అమావాస్య సందర్భంగా ఈ రోజు ఏడుపాయల వనదుర్గ భవాని జాతర పోలీసు బందోబస్తూ వివరాలను తెలియజేస్తూ.. దృష్ట్యా భక్తులకు పుణ్య స్నానాలు ఆచరించడానికి వివిద ప్రాంతాల నుండి ఏడుపాయలకు వస్తారని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎడపాయల అమ్మవారి ప్రాంగణ మొత్తం సీసీటీవీ కెమెరాల పర్యవేక్షయణలో ఉంటుందని అన్నారు. అమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులు సంతోషంగా గడపాలని అన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలి అని కోరినారు. ఏడుపాయల వనదుర్గ భవాని మాతా దర్శనానికి వచ్చే భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని, అధికారులకు సూచించారు. మాఘ అమావాస్య సందర్భంగా ఏడుపాయాలకు వచ్చే భక్తులు పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో వనధుర్గా అమ్మవారి దర్శనం తదితర కార్యక్రమాలు ముగించుకుని వెళ్లాలని కోరినారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు యెస్.పి డా.శ్రీ.బాలస్వామి ఐ.పి.యెస్ గారు,మెదక్ డి.యెస్.పి శ్రీ.సైదులు గారు, మెదక్ రూరల్ సి.ఐ శ్రీ.విజయ్ గారు, పాపన్నపేట ఎస్.ఐ విజయ్ నారాయణ్ గారు,కొల్చారం యెస్.ఐ శ్రీ.శ్రీనివాస్ గారు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking