భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి,10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రవర్తన, సైబర్ నేరాలు మొదలగు అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండేటి ఆనందకుమార్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో షీ టీం సబ్ ఇన్స్పెక్టర్ పి రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు మంచి ప్రవర్తనను కలిగి ఉండాలని, క్రమశిక్షణతో మంచి అలవాట్లు నేర్చుకోవాలని, రోజు పాఠశాలకు యూనిఫామ్ ధరించి రావాలని చెప్పారు. అదేవిధంగా బాలికలు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, అందరూ సైబర్ నేరాల గురించి అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో చండ్రుగొండ ఏఎస్ఐ కృష్ణారావు ఉపాధ్యాయులు మంజు శ్రీ,
డి నరసింహారావు ఎండి వాజిద్ ఏ లక్ష్మణ్ శకుంతల, బి కృష్ణ షేక్ కైసరి బేగం హేచ్ ఎం మరియు షీ టీమ్స్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు..