విలేకరి మృతికి టియుడబ్ల్యూజె (ఐజెయు) సంతాపం

 

మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి

-టియుడబ్ల్యూజె(ఐజెయు) డిమాండ్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 7 (ప్రజాబలం) ఖమ్మం లో వాయిస్ ఆఫ్ వర్డ్స్ పత్రిక విలేకరిగా పనిచేస్తున్న ఏలేటి వెంకటరెడ్డి (46) మృతిపట్ల టియుడబ్ల్యూజె (ఐజెయు) తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు టియుడబ్ల్యూజె (ఐజెయు) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది దశాబ్ద కాలంగా జర్నలిస్టుగా కొనసాగుతున్న వెంకటరెడ్డి స్వగ్రామం జాన్ బాదుతండా కొందరు తన భూమిని ఆక్రమించారని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి బుధవారం మృతిచెందారన్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యూజె(ఐజెయు) డిమాండ్ చేసింది ఒకే కుటుంబానికి సంబంధించి ఎకరం భూ వివాదంలో ఇద్దరి ప్రాణాలు బలిగొన్న వ్యక్తిపై పోలీసులు ఉదాసీన వైఖరి -అవలంభించడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంకటరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, వారి కుటుంబ -సభ్యులకు అండగా నిలవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. టియుడబ్ల్యూజె (ఐజెయు) వెంకటరెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందని వారు తెలిపారు. వెంకటరెడ్డి మృతిపట్ల సంతాపాన్ని తెలిపిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రనాయకులు నర్వనేని వెంకట్రావు, ఖదీర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking