ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 7 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాలేరు నియోజకవర్గ బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు మంగళగూడెం మాజీ సర్పంచ్ కన్నేటి వెంకన్న (60) బుధవారం మృతి చెందారు ఈ సందర్భంగా తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు