న్యాయం వైపే న్యాయవాదులు నిలబడాలి
జూనియర్ సివిల్ జడ్జి సల్లూరు సంపత్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 07 : న్యాయవాదులు ఎల్లప్పుడూ న్యాయం వైపే నిలబడాలని జూనియర్ సివిల్ జడ్జి సల్లూరి సంపత్ పేర్కొన్నారు.బుధవారం గత నాలుగు నెలలుగా ఇన్చార్జి జడ్జిగా సేవలందించిన జూనియర్ సివిల్ జడ్జ్ సల్లూరు సంపత్ ను బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సన్మానించారు.అనంతరం అయన మాట్లాడుతూ…కక్షి దారులను ఘర్షణ లేకుండా రాజీమార్గం ద్వారా తమ సమస్యలు పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్,జనరల్ సెక్రెటరీ ఎన్ రాజేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ గాండ్ల సత్యనారాయణ,ఏజీపీ వేల్పుల సత్యం,సీనియర్ న్యాయవాదులు ఈ రాజేశ్వరరావు,కే భూమారెడ్డి,కే సత్తన్న, అక్కల శ్రీధర్,కారుకూరి సురేందర్,న్యాయవాదులు జి పద్మ,నలినీకాంత్,ఎస్ ప్రదీప్ కుమార్,తిరుపతి, స్వామి,అబ్జల్ బియా జానీ,టి రవి కుమార్,ఎస్కే తాజుద్దీన్,ఉమారాణి,ఎన్ సదాశివం గణేష్,వినీత, శివశంకర్,సునీల్,ఆనంద్, బాబు తదితరులు పాల్గొన్నారు.