రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్

బట్టి సభకు బయలు దేరిన కాంగ్రెస్ శ్రేణులు

రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి చెస్తు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నా,రైతు సంక్షేమం దిశగా రేవంత్ నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను దశల వారిగా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ పేర్కొన్నారు. బుధవారం మండలం నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పిప్పిరి గ్రామంలో నిర్వహిస్తున్న బట్టి సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… బడ్జెట్ లో వ్యవసాయానికి 73 వేల కోట్లకు పైగా కేటాయించిందన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు హక్కు పత్రాలు అందజేస్తున్నామన్నారు.కుఫ్టీ,చిక్ మాన్, పులిమడుగు, సుద్దవాగుల్లో ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తుండిహెట్టి ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి జిల్లా శశ్య శ్యామలం అవుతుందన్నారు.అయన వెంట,కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు,రైతులు తరలి వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking