– వైభవంగా కుమ్మర్ల పోచమ్మ తొలి బోనాలు
ప్రజాబలం ప్రతినిధి హన్మకొండ జిల్లా ఆగస్టు7: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను హన్మకొండ జిల్లా 54 వ డివిజన్ హనుమాన్ నగర్ కుమ్మర సంఘం కులస్తులు బుధవారం పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పసుపు కుంకుమలతో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన పరమాన్న వండుకున్న బోనాలతో పిల్లాపాపలతో ఇంటిల్లిపాది బయలుదేరారు. ధూప దీప నైవేద్యాలతో తీరక్క బొట్లతో అందంగా అలంకరించిన బోనాలను ఎత్తుకున్న భక్తులు డప్పు చప్పుల మధ్య వర్షం పడుతున్న లెక్కచేయకుండా మేళా తాళాల మధ్య మహిళలు బోనాలు, సాక తీసుకొచ్చి అమ్మవారికి కుమ్మర కుల పెద్దలు మొదటి బోనం సమర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాలివాహన కుమ్మర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓదెల చందర్ రావు మరియు హన్మకొండ రెడ్డికాలనీ కుల పెద్దలు,హనుమాన్ నగర్ పోచమ్మ కుంట కుమ్మర కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు.