ఎన్నో అవమానాలు, అత్యాచార విధానాలకు ఎదురొడ్డి నిలబడి, బహుమతులను వెనక్కు ఇచ్చి, క్రీడలపై NDA ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఎదిరించి రోడ్లపై ధర్నాలు చేసి NDA ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి స్వయంకృషితో పథకాలు దేశం కోసం సాధిస్తుంటే, కనీస సదుపాయాలు, క్రీడా రూల్స్ విధానాలు NDA మంత్రిత్వ శాఖ తీసుకోకపోవడం, వారికి కనీస సదుపాయాలు అందించకపోవడం ఈరోజు ప్రపంచం ముందు తలదించుకున్న పని అయింది.ఇది ప్రతి భారతీయునికి అవమానకరం*
50 కేజీల మహిళల ఫ్రీస్టైల్ విభాగంలో పోటీ పడిన వినేష్ ఫోగట్.. 150 గ్రాములు ఎక్కువ బరువు ఉండటంతో రూల్స్ ప్రకారం అనర్హత వేటు వేసారు.
NDA మంత్రిత్వ శాఖ కనీస క్రీడా రూల్స్ పాటించకపోవడం శోచనీయం
భారత్ – ఇండియా అంటూ పేర్లు మార్చటంలో ఉన్న అతి ఉత్సాహం, మహిళలకు రక్షణ, రైతులకు కనీస మద్దతు ధర, నిరుద్యోగులకు ఉద్యోగ భరోసా వంటి విధానాలపై NDA ప్రభుత్వానికి కనీస దృష్టి లేకపోవడం నిజంగా బాధాకరం. NDA ప్రభుత్వ విధానాలు మారాలి.
మహిళలకు, నిరుద్యోగులకు, రైతులకు రక్షణగా, భరోసాగా ఉండాలి.
భారతదేశ కీర్తి పతాకం ఎగరవేయాలి
– శివ చౌదరి కూకట్పల్లి కాంగ్రెస్ లీడర్