అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులు అర్పించిన టిడబ్ల్యూజేఎఫ్. నియోజకవర్గ కమిటీ.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 8

ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజే ఎఫ్) హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు. సౌడమల్ల యోహాన్, అయిత. రాధాకృష్ణ, లు నియోజకవర్గం పాత్రికేయుల పక్షాన గణ నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటని కింది స్థాయి నుండి అనేక ఒడిగడుగులు ఎదుర్కొని పత్రికారంగాన్ని, సినీ పరిశ్రమను స్థాపించి పత్రిక రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని అన్నారు. పత్రికా రంగానికి వారు చేసిన సేవలు చిరస్పరణీయమని పత్రికా రంగంలో వారు లోని లోటు ఎవరు తీర్చలేనిది అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking