న్యాయ సహాయం కోసం గార్లపాటి సురేష్ ను నియమించిన లీగల్ సర్వీస్ అథార్టీ.
మహిళకు అండగా నిలిచిన లాయర్ గార్లపాటి సురేష్.
మెదక్, జూన్,7. ప్రజాబలం ప్రతినిధి.
కుటుంబ యజమాని మరణిస్తే అతని భార్య కు ఇవ్వాల్సిన తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వక పోవడంతో సదరు మహిళ లీగల్ సెల్ సర్వీస్ ఆథార్టీ ని ఆశయించింది.వెంటనే న్యాయ సహాయం కోసం లీగల్ ఎయిడ్ గా మెదక్ గార్లపాటి సురేష్ ను సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ జితేందర్ గారు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో స్పందించిన
అడ్వకేట్ గార్లపాటి సురేష్ చొరవతో తాకట్టు పెట్టిన బంగారం విడుదల చేయించారు. న్యాయ సహాయం కోసం గార్లపాటి సురేష్ ను లీగల్ సర్వీస్ అథార్టీ నియమించింది. లాయర్ గార్లపాటి సురేష్ మహిళకు అండగా నిలిచి న్యాయ సహాయం తో పాటు క్షేత్ర స్థాయిలో పని చేసి చట్ట ప్రకారం బంగారం విడుదల చేయించి మహిళకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే…. అల్లాదుర్గ్ మండల్ కోమటికుంట తాండకి చెందిన దెగవత్ రాజు కర్ణాటక బ్యాంకు కూకట్పల్లి లో 5 తులాల 5గ్రాములు బంగారం తాకట్టు పెట్టి ఋణం తీసుకున్నాడు. అతను అనారోగ్యం తో మృతి చెందాగా రాజు తీసుకున్న లక్ష 40వేల రూపాయలను బ్యాంకు లో అతని భార్య దెగవత్ లక్ష్మి చెల్లించి బంగారు నగలు ఇమ్మనగా వారసత్వ ధ్రువీకరణ పత్రం లేనిదే బంగారం ఇవ్వమని బంగారం ఇవ్వడానికి నిరకరించారు. దెగవత్ లక్ష్మి మెదక్ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ లో పిర్యాదు చేయగా ఆమెకు న్యాయ సహాయం కోసం గార్లపాటి సురేష్ కుమార్ అనే న్యాయవాదిని నియమించింది. అతను అల్లాదుర్గ ఎమ్మార్వో గారికి దర్కాస్తూ చేయించి వివరాలు తెలియచేయగా ఎమ్మార్వో గారు అతని సిబ్బంది స్పందించి కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని కర్ణాటక బ్యాంకు కూకట్పల్లి వారికి పంపగా బ్యాంకు వారు దెగవత్ లక్ష్మీకి అయిదున్నర తులాల బంగారు ఆభరణాలని ఇచ్చింది. దీనితో మహిళా కథ సుఖాంతం అయ్యింది. లాయర్ గార్లపాటి సురేష్ ను పలువురు అభినందించారు.