ఇంటర్మీడియట్ ఫలితాలలో రాష్ట్ర జిల్లా విద్యార్థిని ప్రతిభను ప్రశంసించిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 07 : ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లాకు చెందిన విద్యార్థిని దుర్గం మమత రాష్ట్ర స్థాయిలో 3 వ ర్యాంకు, జిల్లా స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ చాంబార్ లో జిల్లా విద్యశాఖ అధికారి ఎస్ యదయ్య, కళాశాల ప్రత్యేక అధికారి సుమన చైతన్య సుధారాణి కలిసి విద్యార్థి శలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని తాండూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్నా విద్యార్థినీ దుర్గం మమత ఇంటర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరచడం సంతోషంగా ఉందని,అదే స్ఫూర్తితో మరింత విద్యార్థిని, విద్యార్థులు,విద్య తో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ జిల్లాకు,విద్య సంస్థకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నత చదువులు అభ్యసించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking