ఖమ్మం ప్రతినిధి జూన్07( ప్రజాబలం): కారేపల్లి మండలం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన కన్నెబోయిన చంద్రశేఖర్ – సుజాతల కూతురు చి. మేఘన, కు పుష్పాలంకరణ వేడుక మరియు కుమారుడు బి అనుదీప్ కు పంచ కట్టు వేడుక కార్యక్రమం కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ దంపతులు పాల్గొని చిన్నారులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అక్కడకు విచ్చేసిన యాదవ కుల బంధువులును ఆప్యాయంగా పలకరించి న సందర్భంలో గొర్రెల స్కాం ప్రస్తావన గురించి మాట్లాడుతూ దీనిపై జిల్లా వ్యాప్తంగా గొర్రెల పెంపకం దారుల అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చర్చించాల్సిన అవసరం ఉన్నదని, త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈర్ల కోటి, ఇమ్మడి తిరుపతయ్య, కడారి ఉపేందర్, వడ్డే నాగేశ్వరరావు, పుట్ట ఉపేందర్, డేగల ఉపేందర్, లింగయ్య బుచ్చిబాబు తదితర యాదవ బంధువులు పాల్గొన్నారు