కల్తీని అరికట్టడంలో టి సి ఎఫ్ ముందంజ మండల స్థాయి నుంచి టి సి ఎఫ్ కమిటీ లు ఏర్పాటు చేస్తాము. – రుద్రారం శంకర్ (జిల్లా అధ్యక్షులు), డి. అశోక్ (జిల్లా ప్రధాన కార్యదర్శి),
సంగారెడ్డి జూన్ 7 ప్రజ బలం ప్రతినిధి: తెలంగాణ వినియోగదారుల ఫోరం సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు రుద్రారం శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చిచారు. జిల్లాలో నూతన మెంబర్షిప్ మరియు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను వేయుట గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు రుద్రారం శంకర్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ వినియోగదారుల ఫోరంను బలోపేతం చేయడానికి, అవినీతి అక్రమాలకు పాల్పడకుండా వినియోగదారులకు అందుబాటులో ఉండి కల్తీ ని అరికట్టడంలో ముందడడానికి టిసిఎఫ్ ఎల్లవేళలా ఉండి, ప్రజలకు చేయూతనివ్వడంలో ముందుంటామని అన్నారు. వినియోగదారుల కు ఎలాంటి ఇబ్బందులు ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి లేదా డైరెక్టర్ గా మా టి సి ఎఫ్ సంగం కు, పేపర్ పైన కల్తీ, అవినీతి అక్రమాలకు పాలుడుతున్న వారిపై, కన్జ్యూమర్ కోర్టులో కేసు వేయడానికి ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డి. అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు జీ దశరత్, ఏ.టి రాజారావు, కార్యదర్శి ఎం లింగం, కోశాధికారి ఎం జంగయ్య , మెదక్ జిల్లా అధ్యక్షులు పి రామయ్య మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్, విష్ణు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.