గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, విజేందర్ రెడ్డి
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 7: గ్రూప్-1 ప్రిలిమినరీ 6811పరీక్ష ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎలాంటి తప్పిదాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, విజేందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి సమావేశ మందిరంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో 105 సెంటర్ ఉన్నాయని,69727 మంది విద్యార్థిని,విద్యార్థులు ఈ పరీక్షలు హాజరవుతున్నారని తెలిపారు.105 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, జాయింట్ కస్టోడియన్ ఆఫీసర్స్ 7, స్ట్రాంగ్ రూమ్స్ 7, రూట్స్ 18,రూటు ఆఫీసర్స్ 18 మంది, ఫ్లయింగ్ స్కాట్స్ 22 మంది, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, 276, అబ్జర్వర్స్105 మంది నియమించడం జరిగిందని అన్నారు.జూన్ 9న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఈ పరీక్ష ఉంటుందన్నారు.గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కు సంబంధించి చేపట్టాల్సిన విధి విధానాలపై డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్,ఐడెంటిఫికేషన్ అధికారులు, శాఖ పరమైన అధికారులు, పరీక్ష నిర్వహణ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎలాంటి తప్పిదాలకు తావునీయకుండా , అతి జాగ్రత్తగా పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్ష విధులు నిర్వహించే అధికారులు సమన్వయతో పని చేయాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కేంద్రాల్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ వసతులను పరిశీలించాలన్నారు. అందరూ నుండి పరీక్షా కేంద్రానికి ప్రశ్నాపత్రాలు తిరిగి పరీక్ష కేంద్రం నుండి జవాబు పత్రాలు రిసెప్షన్ సెంటర్కు తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ బందోబస్తు తీసుకొని వెళ్లి పరీక్షా కేంద్రాల్లోని లైజ నింగ్ అధికారులకు అందజేయాలి అన్నారు. పరీక్షా కేంద్రం పరిసరాలలో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా సమయంలో మూడు గంటల పాటు జిరాక్స్ సెంటర్లను పూర్తిగా మూసి వేయించాలన్నారు. ఆడ,మగ అభ్యర్థులను విడివిడిగా తనిఖీ చేయాలన్నారు. 100% బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. మాను ప్రాక్టీస్కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా
విద్యుత్తు, టాయిలెట్స్, త్రాగునీరు ఉండే విధంగా అన్నిl ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రూట్ అధికారులు తమ లోకేషన్లను ముందస్తుగానే చూసుకోవాలని, శాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఐడెంటిఫికేషన్ అధికారులు అభ్యర్థి యొక్క హాల్ టికెట్, ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు తమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. పరీక్ష సమయంలో ఏలాంటి తప్పులు జరిగిన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.
పూర్తి పోలీసు బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష రోజున ప్రతి సెంటర్ ను మూడుసార్లు పరిశీలించాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశించడానికి ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు అనుమతి ఉంటుందని ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనను పరీక్ష హాల్లోనికి అనుమతించబడదని తెలిపారు .పరీక్ష కేంద్రం మెయిన్ గేటు ఉదయం 10 గంటలకు మూసి వేయబడుతుందని తెలియజేశారు. అభ్యర్థులు పరీక్షకు కనీసం ఒక్కరోజు ముందుగా తమ పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పరీక్ష కేంద్రం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని తెలుసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, చేతి గడియారాలు, హ్యాండ్ బ్యాగులు, అనుమతించబడదని తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థుల సౌలభ్యం కోసం సమయాన్ని అంచనా వేయడానికి ప్రతి అరగంట పూర్తయిన తర్వాత హెచ్చరిక బెల్ మోగింపబడుతుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ సూచనలు పాటించాలి అని కోరారు . అభ్యర్థులు ఆందోళనకు గురి కావద్దని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఆకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రశ్నాపత్రాన్ని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లను సన్నద్ధం చేయాలని జిల్లాకు ముఖ్యమైన సామాగ్రి, ప్రశ్నాపత్రాలు చేరుకుంటున్నందున వాటిని భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్,రూట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్,ఐడెంటిఫికేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.