గొల్ల గట్టు లింగమంతుల స్వామి జాతర సందర్భంగా రెండు రోజులు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలి

 

అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి

ఇల్లందు ప్రతినిధి ఫిబ్రవరి 14(ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం రాష్ట్రంలో మేడారం జాతర తర్వాత అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో గల దురాజ్ పల్లి గ్రామంలో జరుగు గొల్లగట్టు లింగమంతుల జాతర ను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి రెండు రోజుల ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కామేపల్లి మండలం పండితా పురం గ్రామంలో జరిగిన మండల యాదవ సంఘం సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గొల్ల గట్టు లింగమంతుల జాతర అతి పురాతనమైనదని, దాదాపు 1,000 సంవత్సరాలకు పైగా జాతర నడుస్తున్నట్లు, నాటి కళ్యాణి చాళుక్యులు 11 వ శతాబ్దంలో గిరి దుర్గం పైన జాతర ప్రారంభించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుందని, శివుడిని లింగమంతుల స్వామి గాను, చౌడమ్మ ను శక్తి రూపిణి గా భావించి ఉండ్ర కొండపై రెండు గుడులను కట్టి జంతుబలి తో నైవేద్యం చేస్తూ జాతర ప్రారంభించబడుతుంది ఈ జాతర కార్యక్రమానికి యాదవులు కురుమలే కాకుండా నాలుగు ఐదు రాష్ట్రాల నుండి అనేక సంస్కృతుల సాంప్రదాయాలను అనుసరించి దాదాపు 70 లక్షల మంది కి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అన్ని ఏర్పాట్లు మొదటి నుంచి భారీ ఎత్తున చేపట్టారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ జాతర రాష్ట్ర పండుగగా గుర్తింపు నోచుకోకపోవడం దురదృష్టకరమని, ఈ విషయమై ప్రతి అధికారిని ప్రజాప్రతినిధుల్ని కోరడం విజ్ఞప్తి చేయడం జరిగిందని, ఈ పండుగను కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రకటించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేదు ఈ విధంగా యాదవులు బ్రహ్మాండంగా జరిపేసదర్ పండుగను, ప్రభుత్వం అధికారికంగా జరిపించడంసంతోషదాయకమని, అదేవిధంగా గొల్లగట్టు లింగమంతుల జాతర మాఘమాసపు పౌర్ణమి నుండి ఐదు రోజులు పాటు జరుగుతుందని, రెండు రోజులు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మేకల మల్లికార్జునరావు జాల శ్రీను యాదవ్ జక్కుల బ్రహ్మయ్య సత్తి చిట్టిబాబు కేత బోయిన రాంబాబు మేకల అశోక్ , చిన్న పోయిన సత్యం చిన్నబోయిన కృష్ణ కానబోయిన బిక్షం కానబోయిన వెంకట రాములు అల్లిక బక్కయ్య, సత్తి వీరబాబు మంద నాగేశ్వరరావు చింతల వెంకయ్య ఎర్రగడ్డ రామచంద్రయ్య మేకల మహేష్,లాల్ కృష్ణ మలాదివెంకన్న మల్లాది లింగన్న తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking