యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిని సన్మానించిన యువ నాయకులు

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 14:

యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి యూత్ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో జరిగిన ప్రమాణ స్వీకారంలో మందమర్రి పట్టణ యూత్ కాంగ్రెస్ నాయకుడు రాయబారపు కిరణ్, చెన్నూరు నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్,యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జలంపల్లి సృజన్, యూత్ కాంగ్రెస్ మండల జనరల్ సెక్రటరీ బియ్యపు రవి కిరణ్, యూత్ నాయకులు ఎం.డి తౌసిఫ్, ఒజ్జ గణేష్ లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల యూత్ కాంగ్రెస్ కు ఎన్నికల నిర్వహించగా త్వరలోనే యూత్ కాంగ్రెస్ కు ఎన్నికైన సభ్యుల వివరాలు వెల్లడిస్తామని అయన తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking