రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 14 ఫిబ్రవరి 2025
మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకు లందరు కలసికట్టుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ మరియు కమిషనర్ శ్రీదేవిని మర్యాద పూర్వకంగా కలిసిన విషయం మణికొండ పురపాలక సంఘ పరిధిలోనీ దాదాపు 350 మంది సఫాయి కార్మికులకు తెలియపరుస్తూ మీ కష్ట కాలంలో అన్ని విధాల భారత రాష్ట్ర సమితి పార్టీ మీ అందరికీ వెన్నుదన్నుగా వుంటుందని హామీ ఇవ్వడం జరిగింది. సదరు కమిషనర్ దృష్టికి 2023 తరువాత జీతభత్యాలు పెంచలేదని, పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని జీతాలు 24 వేలకు పెంచవలసిందిగా కోరడమైనదని, సంవత్సరానికి 15 సాధారణ సెలవుల సదుపాయం ఇవ్వడం లేదనీ, అవుట్సోర్సింగ్ లో ఉన్న వారందరినీ పర్మనెంట్ చేయవలసిందని మరియు పిట్టల ఆనంద్ అనే సఫాయి కార్మికుడు చనిపోతే కనీస అవసరాలు తీర్చక, అతని భార్యకు ఉద్యోగం ఇచ్చినప్పటికీ జీతభత్యాలు ఇవ్వకపోవడం చాలా శోచనీయమనీ వివరముగా తెలియ పరుస్తూ రాబోయే ఎండా కాలంలో అవసరాన్ని బట్టి ముఖ్య కూడల్లలో స్వచ్ఛంద సంస్థల ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలియ పరచిన వారిలో కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందె లక్ష్మణ్ రావు, గోరుకంటి విఠల్, ఏర్పుల శ్రీకాంత్, ఉపేందర్నాధ్ రెడ్డి, బండమీది మల్లేశ్, సంఘం శ్రీకాంత్, మహేశ్వరం సుమన్, యాలల కిరణ్, దిలీప్, భాను చందర్, సంతోష్, సుమ నళిని తదితరులు కలరు.
