ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 13 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక అవుతారని ఎమ్మెల్యేలు పాయల్ శంకర్,పాల్వాయి హరీష్ అన్నారు.గురువారం మంచిర్యాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని విమర్శించారు.సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్,ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.