మనోహరాబాద్ మండలంలో రెండు టిప్పర్లు సీజ్ .

 

మెదక్ మనోహరాబాద్ జనవరి19 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జోరుగా గత సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమ మట్టి రవాణా చేస్తు రోడ్లపై రాత్రి వేళలో ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు నడుస్తూ ఉంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
జిల్లా పోలీస్ అధికారులు ఎక్కడ అన్యాయం జరిగిన , అక్రమంగా మట్టి ఇసుక రవాణా చేసిన చట్ట ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు.
పై అధికారుల ఆదేశానుసారం
అక్రమ మట్టి రవాణా చేస్తున్న రెండు టిప్పర్ లు సీజ్ చేసిన మనోహరాబాద్ పోలీసులు.
మండలంలో గురువారం అర్ధ రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి కొడుతున్న రెండు టిప్పర్ లను కుచారం శివారులో పట్టుకొని సీజ్ చేశారు .అనంతరం మనోహరాబాద్ మండల ఎస్సై కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ మట్టి రవాణా చేసినట్లయితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం. మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking