ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 19 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలోని గొపతి తిరుపతి వ్యవసాయ బావి తవ్వుతుండగా పురాతన శ్రీ రాములవారి విగ్రహం బయటపడింది.కొర్విచెల్మ గ్రామంలో పెద్దలు,గ్రామస్థులు,శ్రీరాముని విగ్రహంకి నీటిలో,పాలు,పెరుగుతో, పూజలు నిర్వహించారు.సాయత్రం సమయంలో హనుమాన్ భక్తులు, గ్రామంలో ప్రజలు అందరూ కలిసి, భజన,కీర్తనలతో,ఆడుతూ పాడుతూ శ్రీ రాములవారి విగ్రహంని గ్రామంలో శ్రీ సీతారాముల గుడి వద్ద పెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో మల్యాల చంద్రమౌళి,గొపతి తిరుపతి,రవి,చింతం లచ్చన్న,ముద్థసాని పెద్దయ్య,కారుకురి కిషన్,తిప్పని చంద్రమౌళి,బియ్యల తిరుపతి,మోటపలుకుల మల్లేష్ గ్రామంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.