స్థానిక పత్రికల సమస్యలను సమాచార ప్రచార శాఖ మంత్రి పోంగులేటీ శ్రీనివాసరెడ్డి దృష్ఠికి తీసుకెళ్తా :నకిరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ హైదర్‌గూడ ఎమ్మెల్యే క్యార్టర్స్ లో నకిరికల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వేముల వీరేశం నివాసంలో తెలంగాణా రాష్ట్రం హైదరాబాద్ నుండి ప్రచురితమవుతున్న ప్రజాబలం తెలుగు దినపత్రిక 2024 క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగినది.
ఈ కా ర్యక్రమంలో నకిరికల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణా నుండి వెలువడే స్థానిక పత్రికలకు కాంగ్రెస్ పార్టీ తరుపున సాహకారం అందిస్తామని తెలంగాణా స్థానిక పత్రికల సమస్యలను సమాచార ప్రచార శాఖ మంత్రి పోంగులేటీ శ్రీనివాసరెడ్డి దృష్ఠికి తీసుకెళ్ళి పరిష్కారమయ్యేలా చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో నకిరికల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు వేముల వీరేశంకు ప్రజాబలం దినపత్రిక బ్యూరోఛీఫ్ డా॥ ఆర్పల్లి శ్రీనివాస్ మరియు కె.రాంచందర్ శాలువ కప్పి సన్మానించడం జరిగినది.అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి ,దూదిమెట్ల సత్తయ్య ,గుణగంటి మధుసూదర్‌రావు ,అవినాష్ వంగాల ,బ్రిజేష్ వంశీ తదితరులు పాల్గోన్నారు.