ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

 

కూకట్పల్లి జేఎన్టీయూలో జరిగే కార్యక్రమానికి హాజరు కానున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల జాయింట్ సి ఈ ఓ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 20:
జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 25న మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్పల్లి జేఎన్టీయూలో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరు కానున్నరు. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ సి ఇ ఓ సర్ఫరాజ్ అహ్మద్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జి హెచ్ ఎం సి) కమిషనర్ రోనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. జేఎన్టీయూ కాలేజీ ఆడిటోరియంలో ఈ నెల 25 న జరిగే గవర్నర్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లను పరిశీలించినారు. ఎలాంటి లోటు పాట్లు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించే సమయంలో సభావేదికతో పాటు పాల్గొనే వీఐపీలు కోసం, వసతులను పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఈనెల 25న జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాలోని కూకట్పల్లిలోని జేఎన్టీయూలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నారని తెలిపారు. జిల్లా పరిధిలోని జేఎన్టీయూలో జరిగే కార్యక్రమానికి గవర్నర్ హాజరు కానున్ననేపథ్యంలో ఇప్పటి నుంచే అవసరమైన అన్ని ఏర్పాట్లుపూర్తి చేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చే వారికి సంబంధించి పార్కింగ్ తదితర వివరాల విషయమై పోలీసులకు అవసరమైన సూచనలను కలెక్టర్ గౌతమ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ అభిలాష్ అభినవ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్, ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్, పోలీసు అధికారులు, జేఎన్టీయూ అధికారులు ఆయా శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking