ఖమ్మం వేదికగా నూతన పీఎంజే జ్యువెల్స్‌ స్టోర్‌ ప్రారంభం

స్టోర్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ఖమ్మం మేయర్ పూనకొల్లు నీరజ

ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మం దక్షిణ భారత్‌లో ప్రఖ్యాతిగాంచిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నూతన స్టోర్‌ను ఆవిష్కరించింది. శనివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి శ్రీమతి మల్లు నందిని హాజరుకాగా, అతిథిగా ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పీఎంజే జ్యువెల్స్ బిజినెస్ హెడ్ రామ్ రెడ్డితో పాటు ఖమ్మం పీఎంజే జ్యువెల్స్ స్టోర్ హెడ్ రాజశేఖర్‌ పాల్గొన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పీఎంజే జ్యువెల్స్ ఆధ్వర్యంలో మొదటి ఆరు రోజుల్లో ఆభరణాలను కొనుగోలు చేసే కస్టమర్‌లకు లక్కీ బహుమతిగా గోల్డ్ కాయిన్‌ను ప్రత్యేక ఆఫర్‌గా అందిస్తున్నారు ఈ స్టోర్‌ వేదికగా నేటి నుండి ప్రత్యేక వివాహ ఆభరణాల ప్రదర్శనను ప్రారంభిస్తున్నారు 20 జనవరి నుండి 25 జనవరి వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో విభిన్నమైన, వినూత్నమైన డిజైన్‌లు అందుబాటులో ఉంటాయి. ఖమ్మంలోని కొత్త పీఎంజే జ్యువెల్స్ స్టోర్ అసాధారణమైన నైపుణ్యంతో పాటు అత్యద్భుతమైన డిజైన్‌లను అందించడంలో బ్రాండ్ యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఖమ్మంలోని ఔత్సాహిక కస్టమర్ల విభిన్న అభిరుచులకు అనుగుణంగా అందమైన డిజైన్ చేయబడిన నెక్లెస్‌లు, చెవిపోగులు, ఉంగరాలు తదితర అన్నిరకాల ఆభరణాలు స్టోర్‌లో కొలువుదీరాయి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి శ్రీమతి మల్లు నందిని మాట్లాడుతూ ఖమ్మంలో పీఎంజే జ్యువెల్స్ కొత్త స్టోర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది బ్రాండ్ స్థిరంమైన ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతోంది. ఖమ్మం ప్రజలు ఇక్కడ అందిస్తున్న అద్భుతమైన హస్తకళ మరియు కలకాలం నిలిచిపోయే డిజైన్‌లను అభినందిస్తారని ఆస్వాదిస్తారని విశ్వసిస్తున్నాని తెలిపారు కొత్త స్టోర్‌ విశేషాలు ప్రత్యేక ఆఫర్ గురించి పీఎంజే జ్యువెల్స్ బిజినెస్ హెడ్ శ్రీ రామ్ రెడ్డి పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎంజే జ్యువెల్స్‌ని ఖమ్మంకు తీసుకురావడం మాకు చాలా గౌరవంగా ఉంది. మేము ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ఆహ్వానాన్ని అందజేయాలనుకుంటున్నాము. మా బ్రాండ్‌ను ప్రతిబింబించే సౌందర్యం హస్తకళను అనుభవించడానికి విచ్చేయాలని తెలిపారు. మా కృతజ్ఞతకు చిహ్నంగా., ఆరు రోజుల వివాహ ఆభరణాల ప్రదర్శనలో మా విలువైన కస్టమర్‌లకు కాంప్లిమెంటరీ బంగారు నాణేలను అందిస్తున్నామని వివరించారు పీఎంజే జ్యువెల్స్ ఖమ్మం స్టోర్ హెడ్ రాజశేఖర్ మాట్లాడుతూ పీఎంజే జ్యువెల్స్ అసాధారణమైన నాణ్యత, విలువైన సేవలను అందించడంలో ఖ్యాతిని పొందింది. ఖమ్మంలోని కొత్త స్టోర్ పీఎంజే బ్రాండ్ వృద్ధితో పాటు వినియోగదారులకు మరపురాని షాపింగ్ అనుభవాన్ని అందింస్తుందని అన్నారు. ఖమ్మం ప్రజలకు మేలైన అత్యుత్తమ ఆభరణాలను అందించడానికి మేము కృషి చేస్తున్నామన్నారు సౌందర్యవంతంగా డిజైన్ చేయబడిన వివాహ ఆభరణాల్లో సొగసైన, ఆధునిక అభిరుచులకు అద్దం పట్టేవి ఆభరణ ప్రియులకు ఆకట్టుకుంటాయి. కొత్త స్టోర్‌లో 6-రోజుల వివాహ ఆభరణాల ప్రదర్శన ప్రతి ఒక్కరికీ అరుదైన డిజైన్లను అందిస్తాయి. ఖమ్మంలోని పీఎంజే జ్యువెల్స్ కొత్త స్టోర్ కేవలం షాపింగ్ గమ్యస్థానం మాత్రమే కాకుండా బ్రాండ్ గొప్ప వారసత్తవాన్ని కొనసాగించడంలో స్వచ్చత ప్రమానాలను పాటిస్తుంది ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాజీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పోరికి లక్ష్మీబాయి ఖమ్మం కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేంద్ర. పువ్వాళ్ళ ఇందుమతి. పన్నీరు జాహ్నవి. ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం మాజీ జెడ్పిటిసి బుల్లెట్ బాబు వనం బాబు అయినాల నరసింహారావు మధిర మున్సిపల్ కౌన్సిలర్ కోన ధని కుమార్ మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు. సిద్ధంశెట్టి సందీప్ తదితరులు పాల్గొన్నారు

   

Leave A Reply

Your email address will not be published.

Breaking