నామ అంటేనే అభివృద్ధి

 

నామ బడుగు బలహీన వర్గాలు, పేదల పెన్నిధి

నామ ను మళ్లీ గెలిపించుకుందాం

నామ ను మళ్లీ గెలిపించుకోవడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత అభివృద్ధి

ఎంపీ గా, ట్రస్టీ గా విస్తృతమైన సేవలు

ముత్తయ్య ట్రస్ట్ నేతృత్వంలో ఆటో డ్రైవర్లకు పెద్ద ఎత్తున ఖాకీ చొక్కాలు పంపిణీ

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) కొత్తగూడెం ఎంపీ నామ అంటేనే అభివృద్ధి కి చిరునామా అని పలువురు వక్తలు పేర్కొన్నారు ఎంపీ నామ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ నేతృత్వంలో కొత్తగూడెం నియోజవర్గం పరిధిలోని రుద్రంపూర్, గౌతంపూర్ ఆటో అడ్డాలో శనివారం ఆటో డ్రైవర్లకు పెద్ద ఎత్తున ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. పార్టీ బాధ్యులు చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాణిని పార్లమెంట్ లో బలంగా వినిపిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున కృషి చేసిన నామ నాగేశ్వరరావు ను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఒక వైపు ఎంపీ గా , మరో వైపు నామ ముత్తయ్య ట్రస్ట్ నుంచి భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కి కృషి చేస్తున్నారని అన్నారు. నామ నాగేశ్వరరావు ను మళ్లీ గెలిపించుకోవడం ద్వారామరింత అభివృద్ధికి అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చుంచుపల్లి మండల అధ్యక్షులు ఎండీ ఉమర్ , పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు సంకుబాపన అనుదీప్, నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు , పార్టీ నాయకులు, జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు గుగులోత్ కృష్ణ , నాయకులు రవీందర్, గూడెల్లి యాకయ్య, మామిడి రాజేశ్వరరావు, బుచ్చయ్య, పాటి సుధాకర్, ఆటో యూనియన్ అధ్యక్షులు రవిగౌడ్, పిట్టల రవి, గౌస్, మైలా మురళి, బైరబోయిన రాజు, ఫయ్యజ్, రంజిత్, మాచర్ల ప్రదీప్, రాకేష్, చొప్పరి సతీష్, రమేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking