అందుబాటులో లేని కాంగ్రెస్ యువ నాయకురాలు

👉 అయోమయంలో ఆందోల్ కాంగ్రెస్ యువత

👉 తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో సందిగ్ధంలో యువత

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 6 ( ప్రజాబలం ) ఆందోల్ నియోజకవర్గం గత అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర రాజనర్సింహ గెలుపు కోసం కీలకంగా వ్యవహరించిన, యువజన విభాగం నేడు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతుంది, తన తండ్రి మాట తీరులో కోపం ఉన్న అభివృద్ధి విషయంలో అపర మేధావి అంటూ, తన తండ్రి ఏలుబడిలో కొరవడి ఉన్న ప్రేమ ఆప్యాయతలను తాను పంచుతానంటూ రాజకీయ అరగ్రేటం చేసిన యువ నాయకురాలు త్రిష దామోదర, ఎన్నికల ముందు తన తండ్రి గెలుపు కోసం, అహోరాత్రులు శ్రమించిన ఆందోల్ యువతకు తాను భరోసాగా ఉంటాను అంటూ విజయం సాధించి తన తండ్రి గెలుపులో భాగం పంచుకుంది, కానీ ఆ యువ నాయకురాలు, తన తండ్రి గెలుపు అనంతరం యువతకు అందుబాటులో ఉంటానంటూ ఇచ్చిన హామీకి విరుద్ధంగా, రాజకీయాలకు దూరంగా ఉండటం కనీసం తన అనుచరులతో కూడా కాంట్రాక్ట్ లో లేకపోవడం పట్ల, అందోల్ యువజన కాంగ్రెస్ ఒకింత నిరుత్సాహంలో కూరుకుపోయింది, త్రిష దామోదర, యువతకు చేరువైన తీరు తమ సాధక బాధకాలు చెప్పుకునేందుకు, ఈ తరం నాయకురాలు ఒకరు అండగా ఉంటారననే భావన, అందోల్ యువజన కాంగ్రెస్ లో బలంగా నాటుకుపోయింది,, నాటిన ప్రతి విత్తనం ఫలాలను ఇవ్వజాలదు అన్నట్లు,, యువ నాయకురాలు, యువజన కాంగ్రెస్ విభాగానికి, కనీసం ఫోన్ లో కూడా టచ్ లో లేకపోవడంతో, ఎన్నికల్లో అహోరాత్రులు శ్రమించిన యువత పరిస్థితి నేడు, అగమ్య గోచరంగా మారింది, తమ భవిష్యత్తు రాజకీయంపై భరోసా ఏది అంటూ, తమలో తాము మదనపడుతూ, తోటి వారితో వారి భావాలను పంచుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల పట్ల, కనీస ఆసక్తి లేదన్నట్లుగా యువజన కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నరు, కొనసాగుతున్న పరిస్థితుల తీరులో మార్పు లేకుంటే, స్థానిక సంస్థల్లో అరగ్రేటం చేసేందుకు సిద్ధంగా ఉన్న ఓ తరం,మరో మారు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సిందేనా అని చర్చించుకుంటున్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking