జగిత్యాల జిల్లా ప్రతినిధి మే 06 : జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు గా పశిగామ గ్రామానికి చెందిన గోపతి జనార్ధన్ ని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు నియమించారు.వెల్గటూర్ మండల అధ్యక్షులుగా గతంలో పార్టీ నిర్మాణానికి,ఎంతగనో కృషి చేసిన గోపతి జనార్ధన్ ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీకి విధేయుడుగా పని చేయటం వలన గోపతి జనార్ధన్ ని రెండవ సారి పార్టీ మండల అధ్యక్షులుగా నియమించటం పట్ల మండల పార్టీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గోపతి జనార్ధన్ మాట్లాడుతూ…నాపై నమ్మకంతో నాకు రెండవసారి పార్టీ అధ్యక్ష పదవికి అవకాశం కల్పించటం పట్ల బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.పార్టీ కి విధేయుడుగా ఉంటూ నా శక్తికి మించి పార్టీ ని మండలంలో ముందు వరుసలో ఉండేలా కృషి చేస్తానని అన్నారు.ప్రధాన మంత్రి నరేద్ర మోడి,కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేస్తానాని తెలిపారు.