ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..తెలంగాణ సాధనే ఊపిరిగా జీవించిన మహోన్నత వ్యక్తి ఆచార్య జయశంకర్ అని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌక్ వద్ద ఆయన జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాలులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.తొలి దశ ఉద్యమం ప్రారంభం నాటి నుండి మలిదశ ఉద్యమం వరకు తెలంగాణకు జరుగుతున్న అన్యాయన్ని ఎత్తిచూపుతూ ఉద్యమాన్ని సజీవంగా నిలిపిన మహనీయుడని కొనియాడారు. జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్,కౌన్సిలర్ లు,తారక రఘువీర్,సలీం,ఎస్పీ రాజు,నాయకులు,పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను,అప్పాల ప్రభాకర్,నర్సా రెడ్డి,అయ్యన్నగారీ పోశెట్టి,గణేష్,పట్టణ అధ్యక్షులు బురాజ్ గాజుల రవి కుమార్,మొయిజ్,తదితరులు పాల్గొన్నారు