వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ప్రారంభించడం జరిగిందని, వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వ కులాభరణం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూకలమర్రి గ్రామంలో గత ప్రభుత్వాలు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని అమ్ముకొని, రీసైక్లింగ్ చేసి పక్కదారి పట్టించారని, అలా జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి అందుకే పేదలకు సన్న బియ్యం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాములు, యూత్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాలకుర్తి శంకరయ్య, మొండి మల్లయ్య, సామల్ల రాజు, పొట్ల మధు, గాంధీ, సుమిత్, గణేష్, మేడుదుల పరుశురాం, మేడుదుల శ్రీను, కమలాకర్, ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.