కల్యాణమహోత్సవం, అగ్ని గుండాలు, బండ్లు బోనాలు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు.
మెదక్ తూప్రాన్, మార్చ్, 4 ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి లోని రావెళ్లి గ్రామ శివారులో యాదవ సంఘం అధ్వర్యంలో సోమవారం ఉదయం శ్రీశ్రీశ్రీ భ్రమరాoభ మల్లిఖార్జున స్వామి కళ్యాణం కనుల పండువగా కమనీయంగా అంగరంగ వైభవంగా జరిగింది. బండ్లు, బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పించారు. సోమవారం ఉదయం అగ్ని గుండాలు, శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా అంగరంగ వైభవంగా జరిగింది.

అనంతరం సీనియర్ నాయకులు బూరుగుపల్లి నరేందర్ రెడ్డి, యాదవ సంఘం అధ్యక్షులు అంజయ్య యాదవ్, మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మల్లికార్జున స్వామికి , మరియు గ్రామదేవతలకు కళ్యాణం మహోత్సవం, బండ్లు బోనాలు ఊరేగింపు, నిర్వహిస్తామని రావెల్లి గ్రామంలో అందరం కలిసికట్టుగా ఉండి ఐక్యతతో మల్లికార్జున స్వామి జాతర, రేణుక ఎల్లమ్మ దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని, మంగళవారం శ్రీశ్రీశ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బుధవారం ఉదయం దుర్గామాత, పోచమ్మ తల్లికి బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పిస్తారని రావేళ్ళి యాదవ సంఘం నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి నరేందర్ రెడ్డి, బావని అంజయ్య యాదవ్, బోలెబోయిన మల్లేష్ యాదవ్, బోల్లెబోయిన శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, సాయనోల్ల పోచయ్య యాదవ్, ఐలయ్య యాదవ్ , మల్లేష్ యాదవ్, నరసింహులు, రాజయ్య యాదవ్, సాయనొల్ల మల్లెష్ యాదవ్, పెద్దగొల్ల కిషన్ యాదవ్,గొట్టిముక్కల శంకరయ్య యాదవ్, యాదగిరి, యాదవ సంఘం సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
