ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఫిబ్రవరి 4:
వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 13 అభివృద్ధి పనుల కొనసాగింపు నకు స్మార్ట్ సిటీ బోర్డు అనుమతి మంజూరు చేసిందని అధికారులు తెలిపారు.
సోమవారం వర్చువల్ విధానంలో నిర్వహించిన 26వ స్మార్ట్ సిటీ బోర్డు సమావేశంలో హైద్రాబాద్ నుండి జిడబ్ల్యూ ఎస్, సిసి ఎల్ చైర్మన్ అండ్
రాష్ట్ర ఎం యు ఐ డి సెక్రెటరీ దాన కిషోర్, బోర్డ్ సభ్యులు సి డి ఎం ఏ దివ్య దేవరాజన్, ఆయా ప్రాంతాల నుండి నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్/ బల్దియా ఇంచార్జ్ కమిషనర్/జీ డబ్ల్యు ఎస్ సి సి ఎల్, ఎం డి & సిఈఓ ప్రావీణ్య, బోర్డ్ సభ్యులు కుడా విసి, జనగామ కలెక్టర్ షేక్ రిజ్వన్ బాషా, హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిలు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్/ బల్దియా ఇంచార్జ్ కమిషనర్/జీ డబ్ల్యు ఎస్ సి సి ఎల్ సిఎండి మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పథకం లో భాగం గా గత ఏజెండా లో ఆమోదం పొంది కొనసాగుతున్న బయోమైనింగ్, స్మార్ట్ సిటీ ఫేజ్-1,2 పనులు, నాలాల పునరుద్ధరణ, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం, దసరా రోడ్డు, గవిచర్ల రోడ్డు, వడ్డేపల్లి బండ్, భద్రకాళి బండ్,ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐ సి సి సి) తదితర 13 పనులను గడువును జూన్-2024 వరకు పొడిగిస్తూ బోర్డ్ ఆమోదించిందని, స్మార్ట్ సిటీ జీ డబ్ల్యు ఎస్ సి సి ఎల్ ఎం డి పరిధిలో మంజూరు చేసిన 12 అదనపు అభివృద్ధి పనుల కొనసాగింపునకు స్మార్ట్ సిటీ బోర్డ్ దృవీకరించిందని మేనేజింగ్ డైరెక్టర్ ప్రావీణ్య తెలిపారు.అదేవిధంగా జిడబ్ల్యు ఎస్ సి సి ఎల్ ద్వారా గతంలో మంజూరు చేసి 5 అభివృద్ధి పనుల స్థానంలో ఇతర అభివృద్ధి పనులు ప్రతిపాదించిన నేపద్యంలో ఆ
5 అభివృద్ధి పనుల అనుమతులు రద్దుకు ప్రతిపాదించగా బోర్డ్ ఇట్టి పనులను రద్దు చేసిందనీ,దానికి సంబంధించిన ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని బోర్డు సభ్యులకు ఎండి వివరించారు. ఈ వర్చువల్ కార్యక్రమం లో కుడా సి పి ఓ అజిత్ రెడ్డి,బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర,ఈ ఈ భీమ్ రావు, శ్రీనివాస్ రావు, స్మార్ట్ సిటీ పి ఎం సి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.