తాజా మాజీ సర్పంచ్ పిట్ల పోచయ్య సమక్షంలో శలాక రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో కిష్ఠాపూర్ లో ఉగాది పంచాంగ పఠనం.
మెదక్ తూప్రాన్ ఏప్రిల్ 9 ప్రజాబలం న్యూస్ :-
శ్రీ కోదీ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని
మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ కిష్టాపూర్ గ్రామంలో హనుమాన్ ఆలయంలో స్థానిక తాజా మాజీ సర్పంచ్ పీట్ల పోచయ్య ముదిరాజ్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిపించి పంటలు బాగా పండి పాడీ పంటలతో ఇంటిల్లిపాదికి వారికి శుభాలను కలిగించాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లా
తూప్రాన్ మండలం కిష్ఠాపూర్ గ్రామంలో మంగళవారం ఉగాది పండుగను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సంప్రదాయ
బద్ధంగ జరుపుకున్నారు.తీపి,వగరు,పులుపు,తదితర షడ్రుచులలో ఉగాది పచ్చడిని తయారుచేసి ఇంటిల్లిపాదీ సేవిం చారు.తీపి పిండివంటకాలతో బోజనాలు చేశారు. అనంతరం సాయంత్రం పంచాయతీ కార్యాలయం వద్ద తాజా మాజీ సర్పంచ్ పిట్ల పోచయ్య ఆధ్వర్యంలో పంచాంగ పఠనం. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. క్రోది నామ సంవత్సరంలో పాడిపంటలు,వర్షాలు,ఆర్థిక పరి స్థితులు,ఆదాయ వ్యయాలు, వాతావరణ పరిస్థితులు తదితర విషయాల గురించి పురోహితుడు సలాక రాజేశ్వర్ శర్మ గ్రామస్తులకు పంచాంగాన్ని చదివి వినిపించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్త ఏడాదిలో జరిగే శుభ,అశుభ ,లాభం,నష్టాల గురించి ఆసక్తిగా విన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ శ్యామ్ సుందర్ రెడ్డి, తాజా మాజీ వార్డ్ మెంబర్లు, బీఆర్ ఎస్ నాయకులు క్రిష్ణారెడ్డి, మల్లారెడ్డి, చుక్క శ్రీశైలం, శ్రీశైలం గౌడ్,మాజీ సర్పంచి వెంకటేశం, రవి ముదిరాజ్, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
