150 కోట్లతో మున్నేరు పై ఆర్ సి సి వాల్ నిర్మాణంకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో హర్షాతిరేకాలు
సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ చిత్రపటాలకు పాలాభిషేకం
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 01 (ప్రజాబలం) ఖమ్మం ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంత ప్రజల కల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ చిత్రపటాలకు సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్ డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు ఆర్జేసి కృష్ణ మంత్రి పీఏ చిరుమామిళ్ల రవికిరణ్ గారు చేశారు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనేక పార్టీలు ఏళ్ల తరబడి ఆయా ప్రాంత ప్రజలను కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వినియోగించుకున్నరు.నేడు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలితంగా బాధితుల చిరకాల కోరిక, ఆర్ సి సి కాంక్రీట్ వాల్ నిర్మించడం ద్వారా అందరికీ మేలు జరుగుతుందని సంకల్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేబినెట్ లో ప్రతిపాదించగా సీఎం కేసీఆర్ నాయకత్వం లో కేబినెట్ ఆమోదం తెలిపింది అని స్పష్టం చేశారు.మున్నేరుకు రెండు వైపు కాంక్రీట్ వాల్ నిర్మాణతో ఈ సమస్యను శాశ్వత ఫలితం ఉంటదని, కరకట్ట నిర్మాణ చేపడితే చాలా మంది ఇల్లు కోల్పోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి స్థానిక పరిస్థితులను ముఖ్యమంత్రి కేసీఅర్ గారికి క్షుణ్ణంగా నివేదించిన దరిమిలా మంత్రి ఆలోచనతో సంతృప్తి చెందిన సిఎం కేసీఅర్ గారు తక్షణమే రూ.150 కోట్లు మంజూరు చేయడం పట్ల యావత్ ఖమ్మం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్నేరు బాధితులు పెద్ద ఎత్తున పండగ చేసుకున్నారు. తమ కష్టలు తొలగించాలని మొన్న మంత్రి పువ్వాడ కు విజ్ఞప్తి చేసిన బాధితులు రెండు రోజులు గడవక ముందే ఈ సమస్యకు పరిష్కారం చూపడం పట్ల తమపై మంత్రి పువ్వాడ కు ఎంత ప్రేమ ఉందో స్పష్టత వచ్చేసింది.అందుకు కృతజ్ఞతగా బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో మున్నేరు నది ఒడ్డున గల బతుకమ్మ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి కేసీఅర్ గమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి నిర్వహించిన క్షీరాభిషేకం కార్యక్రమంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు, ఖమ్మం నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జై కేసీఅర్.. జై పువ్వాడ అంటు పెద్ద ఎత్తున నినాదాలతో మున్నేరు హోరెతత్తేలా మారుమోగించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,డివిజన్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.