నిరుపేద మహిళకు కుట్టు మిషన్ అందజేసిన పొంగులేటి

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 01 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని 11వ డివిజన్ కవిరాజ్ నగర్ కు చెందిన సుంచు లక్ష్మి అనే నిరుపేద మహిళకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుట్టు మిషన్ ను తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం అందజేశారు. అంతకుముందు రామలీల ఫంక్షన్ హాల్లో సీబీఎస్ కార్ గ్యారేజ్ తరుపున మున్నేరు ముంపు బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీని ప్రారంభించారు. అదే విధంగా త్వరలో వివాహం చేసుకోనున్న ముస్లిం యువతికి కానుకగా పట్టువస్త్రాలను వారి తల్లిదండ్రులకు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. శీనన్న సైన్యం జాయిన్ ద మిషన్-2023 సామాజిక మాధ్యమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైరా నియోజకవర్గంలో జరుగుతున్న గ్రామపంచాయితీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలోనూ పొంగులేటి పర్యటించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయాలను అందజేశారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking