ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి 8
మహాశివరాత్రి పర్వదినాన కేంద్ర పర్యటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆలయ కార్యనిర్వహణ అధికారి శేషు భారతి పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు.ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతినీ దర్శించుకున్న అనంతరం భద్రకాళి అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆశీస్సులు అందిస్తూ అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాలను బహుకరించారు. ఆయనతో పాటు వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్, కొండేటి శ్రీధర్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.