భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజక వర్గ పరిధిలో మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రసిద్ధి గాంచిన డొంగుర్ గాం గ్రామంలోని సిద్దేశ్వరాలయం, మరియు మగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన త్రయంబకేశ్వర ఆలయల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆ పరమ శివుని కోరారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను 5 ఏళ్లపాటు తనవంతుగా ప్రజా సంక్షేమం,అభివృద్ధికి పాటుపడి రుణం తీర్చుకుంటానని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking