స్మార్ట్ ఫార్ములా తో ద్విచక్ర వాహనాన్ని హెల్మెట్ కు అనుసంధానించడం అభినందనీయం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 08 : స్మార్ట్ ఫార్ములా తో ద్విచక్ర వాహనాన్ని హెల్మెట్ కు అనుసంధానించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నిలపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ హెల్మెట్ ని తయారు చేసిన మంచిర్యాల జిల్లా కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 9 వ తరగతి చదువుతున్న వెన్నంపల్లి సిద్ధార్థ్ సాయిని జిల్లాలోని నస్పూర్ లో గల సమికృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అభినందించారు హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ద్వారా ప్రమాదాలు జరగడం జరిగినప్పుడు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు హెల్మెట్ లేని వాహనం స్టార్ట్ కాకుండా ద్విచక్ర వాహనం చొదకులను ప్రమాదాల భారీ నుండి కాపాడాలని ఉద్దేశంతో స్మార్ట్ హెల్మెట్ ను తయారు చేయమని తెలిపారు. స్మార్ట్ హెల్మెట్ తలకు ధరించకపోతే ద్విచక్ర వాహనం స్టార్ట్ కాకుండా వాహనానికి హెల్మెట్ సెన్సార్ ని అనుసంధానం చేస్తామని విద్యార్థి సిద్ధాంత సాయి వివరించారు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి నష్టపోవడమే కాకుండా అతని మీద ఆధారపడి కుటుంబ సభ్యులు కూడా ఎంతో నష్టపోయారని ఈ నేపథ్యంలో స్మార్ట్ హెల్మెట్ ఒక మంచి ఆలోచన అని అన్నారు.