బూరుగుపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి శివుణ్ణి దర్శించుకున్న నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నమ్మకం ఉంచి భక్తి మార్గంతో నడవాలని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు.నిర్మల్ నియోజకవర్గం మామడ మండల కేంద్రం బూరుగుపల్లి లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురిష్కరించుకొని శుక్రవారం ఉదయం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.భక్తి మార్గం ఉత్తమమైనదని ,ఆ మార్గంతో ఆత్మ విశ్వాసం,క్రమ శిక్షణ ,పెరుగుతుందని శ్రీహరి రావు తెలిపారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శ్రీహరి రావుకి తీర్థ ప్రసాదాలు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సోమ భీమ్ రెడ్డి ,మామడ మాజీ సర్పంచ్ బాపయ్య ,నాయకులు తదితరులు పాల్గొన్నారు