చందాయిపేట గ్రామ ప్రజలకు మరియు చేగుంట మండల ప్రజలకు మహాశివరాత్రి శభాకాంక్షలు. బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ తాజామాజీ గ్రామ సర్పంచ్
చేగుంట మండల కాంగ్రెస్ నాయకులు బుడ్డభాగ్యరాజ్
మెదక్ ప్రాజబలం న్యూస్:-
హిందూ మత పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు *మహాశివరాత్రి వస్తుంది.శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది అని
మెదక్ జిల్లా చేగుంట మండల్ చందాయి పేట్ తాజా మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ శివాలయంలో పూజలు నిర్వహించి మహాశివరాత్రి శుభాకాంక్షలు దేశ ప్రజలందరికీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అంటే స్వర్గ లోక* నివాసులు,పరమ పవిత్రులు, పూజింపదగిన వారు.హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సృష్టి అంతటికీ *మూలాధారం. ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, భోళాశంకరుడిగా,పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే పరమేశ్వరుడు.అందుకే మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.