డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్ సాగర్ రావు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 08 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీ పరిదిలోని సీతారాంపల్లి గోదావరి,హాజిపూర్ మండలంలోని ముల్కల్ల, రాపల్లిలో నది పుణ్య స్నానాలకు విచ్చేసిన భక్తులందరికీ కీ,,శే,, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో భక్తులందరికీ అల్పాహారం పంపిణీ చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు మాట్లాడుతూ…మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి నది పుణ్య స్నానాలకు విచ్చేసిన భక్తులకు కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ద్వారా అల్పాహారం పంపిణీ చేయడం జరిగింది తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.