మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం:తపస్

 

మెదక్ టౌన్ 8/03/24 ప్రాజబలం న్యూస్:-

మెదక్ పట్టణంలోని తపస్ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం ,చల్లా లక్ష్మన్ లు మాట్లాడుతూ నిన్న హరీష్ రావు ఉద్యోగ, ఉపాధ్యాయులను అవమానించే విధంగా రైతుబందు ఆపి ఉద్యోగులకు జీతాలు ఇస్తారా అనడం సరైంది కాదని,ఆయన వ్యాఖ్యల్ని తపస్ మెదక్ జిల్లా పక్షనా తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతులను ఉద్యోగులపైకి రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని, ఉద్యోగ,ఉపాధ్యాయులకు మొదటి తారీకు జీతాలు ఇస్తే మీకున్న అభ్యంతరం ఏమిటని వారు ప్రశ్నించారు. రైతుబంధు ఆపమని ఉద్యోగ, ఉపాధ్యాయులు చెప్పారా? తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర వహించిన ఉద్యోగ,ఉపాధ్యాయులను అవమానించడం సరికాదని, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయులకు 15 తేదీ వరకు జీతాలు ఇవ్వకుండా, బ్యాంకుల చెక్స్ బౌన్స్ అయి, రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించినాయని, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల తీసేసి, మహిళా ఉద్యోగుల తోని బాత్రూం లు కడిగించింది మీరు కాదా?
కులానికొక గురుకుల పాఠశాల ప్రారంభించి కులాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా? మీ ప్రభుత్వ కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిదంగా ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటే మేము అడిగామా అని వారు అన్నారు.ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ,ఉపాధ్యాయుల పట్ల కక్షసాధింపు ధోరణితో ఉండేదని అందులో భాగంగానే గత పి ఆర్ సి లో ఏడున్నర శాతం ఫిట్మెంట్, ఐదు శాతం మధ్యంతర భృతి ఇచ్చి తీవ్రంగా అవమానించిందని వారు తెలిపారు.ఈ కార్యక్రమం లో తపస్ నాయకులు మాధవ రెడ్డి,టి.నర్సింలు, మార్గం రాజు,శ్రీకాంత్ రెడ్డి, సిద్దు, నరేందర్, మధు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking