నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఓబిసి పట్టణ అధ్యక్షుడిని ఘనంగా సన్మానం చేసిన బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకులు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 25 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగంగా మంచిర్యాల పట్టణానికి చెందిన బీసీ సంఘాల ఐక్యవేదిక నాయకుడు కొత్తపల్లి రమేష్ ను కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా,బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా మంగళవారం సన్మానించారు.ఈ సందర్భంగా వేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడారు.బీసీలు వివిధ పార్టీలలో ఉన్నత పదవులు అధిరోహించి,ఆ పదవులకే వన్నేతేవాలన్నారు.బిసి సమాజాన్ని అనునిత్యం చైతన్యం చేయాలని ఆయన కోరారు.బీసీ హక్కుల సాధనకు ఇతర బీసీ నాయకులందరూ కృషి చేయాలన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు ఒడ్డే రాజమౌళి,మంచిర్యాల జిల్లా బీసీ సంఘాల ఐక్యవేదిక సీనియర్ నాయకుడు గజెల్లి వెంకటయ్య,రాసమల్ల కుమార్,శ్రీపతి రాములు, కారుకూరి శ్రీనివాస్ ఆరందులరాజేశం,జంబోజి శ్రీనివాస్,పంపిరి వేణుగోపాల్,నవీన్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking