రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమo

వికలాంగులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలి

ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం ఉద్యమించాలి

 ఎన్ పి ఆర్ డి ఆవిర్భావ దినోత్సవంలో వక్తలు.

…రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్,

…రాష్ట్ర ప్రదాన కార్యదర్శి యం అడివయ్య.

….ఆర్ వెంకటేష్ రాష్ట్ర కోశాధికారి.

సంగారెడ్డి పిబ్రవరి 21 ప్రజ బలం ప్రతినిధి:
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక( ఎన్ పి ఆర్ డి)15వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ రోజు చిక్కడపల్లి రాష్ట్ర కార్యాలయం దగ్గర ఎన్ పి ఆర్ డి పతకాన్ని ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ ఆవిష్కరణ చేశారు.
*ఈ సందర్బంగా కె వి పీ ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి టి స్కైలాబ్ బాబు, ఎన్ పి ఆర్ డి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, యం అడివయ్య, రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ…
భారత రాజ్యాంగం పౌరులందరు సమానమే, ఎలాంటి వివక్షతలు పాటించరాదు, ప్రజలకు సమాన అవకాశాలు, హక్కులు ఉన్నాయని పేర్కొన్న, వికలాంగులకు దక్కడం లేదని అన్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలను మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. రాజ్యాంగo స్థానంలో మానుధర్మ శాస్త్రన్ని అమలు చేయాలనే బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని అన్నారు. మనుధర్మ శాస్త్రం వికలాంగులను అన్నింటికీ దూరం చేస్తుందని అన్నారు.
“ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందం ప్రకారం” వికలాంగులు సకలాంగులతో సమానంగా అన్ని మానవ హక్కులను, స్వేచ్ఛను అనుభవించేందుకు అవసరమైన ప్రోత్సాహన్ని, భద్రతను కల్పించాలని అన్నారు.
అంటీజం,సెరిబ్రల్ పాల్సి, బుద్దిమంధ్యం,బహుళ వైఖల్యం కలిగిన వికలాంగులు, వారి తల్లిదండ్రులనుఆదుకోవాలని డిమాండ్చేశారు. 2016వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం గుర్తించిన 21రకాల వైకల్యాల ప్రకారం 15 శాతం కంటే ఎక్కువ జనాభా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిందని అన్నారు .2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వికలాంగుల చట్టాలు మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది.9 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ను విలీనం చేయాలని,కార్పొరేట్ సంస్థల ఒత్తిడి మేరకు 2016RPWD చట్టంలోని సెక్షన్ 89,92,93లను మార్చాలని కుట్రలు చేస్తుంది.2015లో మాన్ కీ బాత్ పోగ్రామ్లో “వికలాంగులు కాదు వీళ్లందరు దివ్యంగులు”అని అర్భాటoగా ప్రకటించారు.10ఏండ్ల కాలంలో దివ్యంగులుగాపేరు మార్చిన తరువాత వికలాంగులకు అదనంగా వచ్చిన ప్రయోజనం ఏమి లేదు.సుగమ్య భారత్ అభియాన్ పేరుతో సామూహిక ప్రాంతాలన్నీ అవరోధరహితంగా మార్చాలని నిర్ణయించిన నేటికీ పూర్తి కాలేదు.వికలాంగుల హక్కుల పరిరక్షణనే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం నేటికీ నేషనల్ ట్రస్ట్,2016 RPWD వంటి సంస్థలకు చీఫ్ కమిషనర్స్ ను నియమించలేదు. మానసిక వికలాంగుల సంరక్షణ చట్టం 2017 అమలుకు నోచుకోవడం లేదు. జిల్లా కేంద్రల్లో మానసిక వికలాంగుల కోసం పునరావాస కేంద్రలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లలో వికలాంగులకు మినహాయింపు ఇవ్వలని నిర్ణయం చేసి నిరుద్యోగ వికలాంగుల జీవితాలతో ఆడుకుంటుంది. వికలాంగులకు ప్రభుత్వ శాఖలాన్ని 5శాతం నిధులు బడ్జెట్ లో కేటాయించి ఖర్చు చేయాలనే చిత్తశుద్ధి లేదు.వికలాంగులకు UDID కార్డ్స్ జారీ చేయడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కన్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 0.03 శాతం మాత్రమే ఉద్యోగులు ఉన్నారు.ప్రభుత్వ రంగం సంస్థలను ప్రయివేట్ పరం చేయడం వలన వికలాంగులు రిజర్వేషన్ పొందే అవకాశాన్ని కోల్పోతారు.వికలాంగులకు సామాజిక భద్రత, అంత్యోదయ కార్డ్స్,బడ్జెట్లో 5శాతం నిధుల కేటాయింపు, వికలాంగుల చట్టాల అమలు, ప్రయివేట్ రంగంలో 5శాతం రిజర్వేషన్స్ అమలు వంటి అంశాల సాధన కోసం దేశవ్యప్త ఉద్యమలు నిర్వహిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 10.48లక్షల మంది వికలాంగులు ఉన్నారు. తెలంగాణ డిసెబుల్డ్ సర్వే అఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఒక్కటి కంటే ఎక్కువ వైకల్యాలు కలిగిన వికాలంగులు 40లక్షల మంది ఉన్నారని అంచనా. రాష్ట్ర జనాభాలో 12.2 శాతం వికలాంగులు ఉన్నారు.వీరిలో 2024 జనవరి నాటికి 5,14,422 మందికే ఆసరా పెన్షన్స్ వస్తున్నయని అన్నారు
తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు నిర్వహించడంలో నిర్వహించడంలో ఎన్ పి ఆర్ డి అగ్రబాగానఉంది.2010 నుండి ఎన్ పి ఆర్ డి చేసిన పోరాటాలే నేడు వికలాంగులను ప్రభుత్వలు గుర్తించే పరిస్థితి వచ్చిందని అన్నారు.యూనివర్సిటీలలో చదివే విద్యార్థులకు ల్యాప్టాప్స్,4జి స్మార్ట్ ఫోన్స్, అడ్మిషన్స్లో రిజర్వేషన్స్ అమలు చేయాలని పోరాడి సాధించింది.ఉపాధి హామీ పథకంలో 150రోజులు ప్రత్యేకంగా వికలాంగులకు పని దినాలు కల్పించాలను పోరాడి సర్క్యూలర్ సాధించింది.
పెన్షన్ 10వేలకు పెంచాలని పోరాడి 4016 సాధించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 5శాతం ప్రత్యేకంగా అమలు చేయాలని పోరాడి జీవో సాధించింది. సకలాంగులకు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల్లో 5శాతం వికలాంగులకు కేటాయించే విదంగా ఉద్యమలు చేసి విజయాలు సాధించింది. వికలాంగుల కార్పొరేషన్ బలోపేతం, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అమలు కోసం పోరాడుతుంది.మహిళా వికలాంగుల సాధికారత, భద్రత కోసం పోరాటాలు చేస్తుంది.చట్టాలు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ జీవోలు,21రకాల వైకల్యలపై అవగాహనా కల్పిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.ఫిబ్రవరి 21నుండి 28వరకు సంగం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు జరుపుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి రాష్ట్ర నాయకులు యూసఫ్, శివశంకర్, రాజు, గంగమ్మ, నర్సింగ్ రావు, వరప్రసాద్, కెవిపీఎస్ రాష్ట్ర కమిటి సభ్యులు బాలపీరు, ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking